డ్రగ్స్ తో సంబంధం ఉన్న వాళ్ళను ఎందుకు దాస్తున్నారు…?: హైకోర్ట్

-

డ్రగ్స్ కేసులకు సంబంధించి తెలంగాణా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. డ్రగ్స్ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్న రేవంత్ రెడ్డి పిల్ పై విచారణ జరిగింది. 2016లో నమోదైన డ్రగ్స్ కేసులను సీబీఐ, ఈడీకి ఇవ్వడం లేదని న్యాయవాది రచన రెడ్డి హైకోర్ట్ కి తెలిపారు. ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసుల వివరాలు ఇవ్వడం లేదని హైకోర్టుకు ఈడీ తెలిపింది.

ఎఫ్ఐఆర్ లు, ఛార్జిషీట్లు, వాంగ్మూలాలు ఇచ్చేలా ఎక్సైజ్ ను ఆదేశించాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీకి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. డ్రగ్స్ తో సంబంధాలున్న వారిని దాచి పెట్టాల్సిన అవసరాలు ఏంటీ అని హైకోర్ట్ ప్రశ్నించింది. డ్రగ్స్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తోందని మండిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version