జార్ఖండ్‌లో రాత్రి పూట రోడ్డు మీద క‌నిపించింది గ్ర‌హాంత‌ర‌వాసేనా ? నిజ‌మెంత ?

-

గ్ర‌హాంత‌ర‌వాసులు ఉంటారా ? అన్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు సైంటిస్టులు స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయారు. కొంద‌రు ఉంటార‌ని చెబుతుంటారు, ఇంకొంద‌రు గ్ర‌హాంత‌ర‌వాసులు లేర‌ని అంటుంటారు. అయితే ఈ విష‌యం ప‌క్క‌న పెడితే అప్పుడప్పుడు త‌మ‌కు గ్ర‌హాంతర వాసులు కనిపించార‌ని కొంద‌రు చెబుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంటారు. వాటిని చూస్తే నిజంగానే ఏలియ‌న్స్ ఉన్నార‌ని న‌మ్మాల్సి వ‌స్తుంది. స‌రిగ్గా అలాంటి వీడియోనే ఒక‌టి తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

జార్ఖండ్‌లోని హ‌జారిబాగ్‌లో రాత్రి పూట గ్ర‌హాంత‌ర‌వాసులు సంచ‌రిస్తున్నార‌ని ఓ వీడియో వైర‌ల్ అయింది. దాన్ని చూసిన స్థానికులు నిజంగానే భ‌య ప‌డ్డారు. అత్యంత స‌హ‌జ‌సిద్ధంగా వీడియో ఉండ‌డంతో నెటిజ‌న్లు కూడా ఆ వీడియో నిజ‌మే అనుకున్నారు. కానీ అందులో ఉంది గ్ర‌హాంత‌ర వాసి కాద‌ని, మ‌నిషే అని నిర్దార‌ణ అయింది.

ఆ ప్రాంతానికి చెందిన దీప‌క్ హెన్‌బ్రామ్ అనే వ్య‌క్తి చ‌క్ర‌ధ‌ర్‌పూర్ నుంచి త‌న ఆరుగురు స్నేహితుల‌తో క‌లిసి వ‌స్తున్నాడు. రాత్రి పూట మార్గ‌మ‌ధ్య‌లో ఓ మ‌హిళ బూడిద ధ‌రించి న‌గ్నంగా క‌నిపించింది. ఆమెను దీప‌క్ వీడియో తీశాడు. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే ఆ వీడియోలో ఉన్న‌ది గ్ర‌హాంత‌ర వాసి అని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో స్పందించిన దీప‌క్ అస‌లు విష‌యం చెప్పాడు.

తాను త‌న స్నేహితుల‌తో క‌లిసి వ‌స్తున్న‌ప్పుడు ఓ మ‌హిళ రోడ్డు మీద న‌గ్నంగా బూడిద పూసుకుని క‌నిపించిద‌ని, కానీ ఆమె గ్ర‌హాంత‌ర వాసి కాద‌ని తెలిపాడు. అక్క‌డ అలాంటివి స‌హ‌జ‌మేన‌ని, కొంద‌రు రాత్రి పూట న‌గ్నంగా మారి బూడిద పూసుకుని పూజ‌లు చేస్తారని, ఆ మ‌హిళ కూడా అలాగే చేసింద‌ని తెలిపాడు. దీంతో అస‌లు విష‌యం తెలుసుకున్న నెటిజన్లు షాక్‌కు గుర‌వుతున్నారు. నిజంగానే ఏలియ‌న్స్ ఉన్నాయ‌ని భ‌య‌ప‌డ్డామ‌ని, కానీ అస‌లు విష‌యం తెలిసి ఊపిరి పీల్చుకున్నామ‌ని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version