ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఒకరోజు ముందుగానే ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చేనెల అంటే సెప్టెంబర్ ఆరవ తేదీన ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనం ఉంటుందని ఉత్సవ కమిటీ తాజాగా ప్రకటన చేసింది.

సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆదివారం కావడంతో.. సమావేశమైన ఉత్సవ కమిటీ సభ్యులు.. నిమజ్జన తేదీని ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ ఆరో తేదీన నిమజ్జనం చేయనున్నారు. ఇక అటు ఇవాళ సెలవు దినం… కావడంతో ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు హైదరాబాద్ నగర నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు.