ఇవాళ ప్రవేశపెట్టిన 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల చట్టాన్ని రద్దు చేసే బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా వేడి వాడిగా కొనసాగుతున్నాయి. నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ఆదివారం అయినప్పటికీ ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాలేశ్వరం రిపోర్టును.. అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల సమయంలో… ఈ కాలేశ్వరం రిపోర్ట్ పై చర్చ ఉంటుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించే ఛాన్స్ లు ఉన్నాయి. ఈ తరుణంలోనే ఇవాళ ప్రవేశపెట్టిన 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.