నేడు ఏపీ కేబినెట్ భేటీ..ఈ అంశాలపైనే చర్చ !

-

ఏపీ కేబినెట్ సమావేశానికి ముహుర్తం ఫిక్స్‌ అయింది. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగనుంది. SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్…. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కూడా చర్చించనుంది. కాగా.. ఈ నెల 15 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు.

chandrababu The time has been fixed for the AP Cabinet meeting

ఇక అటు ఏపీలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదంటూ నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పటినుంచి జగన్ 2.0 ని చూస్తారని నిన్న వైఎస్ జగన్ కామెంట్స్‌ చేసిన సంగతి తెలసిందే. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తానని వివరించారు. అయితే.. జగన్ చేసిన కామెంట్స్‌ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అసలు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నించారు.ఎంతో మంది దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లను చంపాడని ఆరోపణలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news