‘కార్గిల్ విజయ్ దివస్’ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశ రక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు.. జవాన్ల గురించి యోచించాలన్న వాజ్పేయీ వ్యాఖ్యలు సదా ఆచరణీయమన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్న ప్రధాని.. కార్గిల్ స్ఫూర్తితోనే కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరవలేము అని,సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది అని అన్నారు. దేశ సమగ్రతకు, సైనికులు చూపే ధైర్య సాహసాలకు వందనం తెలిపారు నరేంద్రమోదీ. సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువకూడదని వ్యాఖ్యానించారు.
కార్గిల్ సమయంలో వాజ్పేయీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం ఇప్పటికీ అనుసరణీయమే అని అప్పటి ప్రతిభను మరువకూడదని అన్నారు భారత్ లోని పేదల ప్రయోజనాల దిశగా.. కీలక నిర్ణయాలకు ముందు యోచించాలని మహాత్ముడు పిలుపునిచ్చారని వాజ్పేయీ నాడు గుర్తుచేశారు. ఏ కీలక నిర్ణయమైనా తీసుకునేముందు సైనికుల ప్రయోజనాలు ఆలోచించాలని నాడు పేర్కొన్నారు. గత కొద్దినెలలుగా భారత్ ఐక్యంగా కరోనాపై పోరాడుతోంది,ఈ కారణంగానే పలు దేశాల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉంది అని అన్నారు.