తెలుగు రాష్ట్రాలకు బ్యాడ్ న్యూస్…! పిడుగు లాంటి వార్త…!

-

ఒక పక్క కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు వరుణుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. దీనితో లక్షల మంది రైతులు తమ పంట ను నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రెండు రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

అరేబియా మధ్య ప్రాంతం నుంచి కర్నాటక మీదుగా విదర్భ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణితో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితలానికి 900 మీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు అధికారులు. ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రా పై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఉత్తర కోస్తాంధ్ర, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై ప్రభావం చూపుతుందన్న అధికారులు… రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పంటలు తడిసిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version