వెబ్ సిరీస్.. 75 మంది ప్రాణాలు కాపాడింది..!

టైటిల్ చూడగానే వెబ్ సిరీస్ ప్రాణాలు కాపాడడం ఏంటి అని అందరికీ అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ నిజంగానే ఇదే జరిగింది. వెబ్ సిరీస్ చూస్తూ ఉండడం కారణంగానే ఏకంగా 75 మంది ప్రాణాలను కాపాడ కలిగాడు ఇక్కడ ఒక యువకుడు. ఈ అరుదైన ఆసక్తికర ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర లో నివసించే కూనాల్ అనే యువకుడికి వెబ్ సిరీస్ లంటే ఎక్కువగా పిచ్చి. రాత్రి పగలు అనే తేడా లేకుండా వెబ్ సిరీస్ ను చూస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలోనే ఇటీవలె అర్ధరాత్రి నుంచి ఉదయం నాలుగు గంటల వరకు వెబ్ సిరీస్ చూస్తూనే కాలం గడిపాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి పై అంతస్తు కూలుతున్నట్లుగా సదరు యువకుడు గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు యువకుడు ఆ ఇంట్లో ఉన్న మిగతా వారిని అప్రమత్తం చేయడంతో అందరూ బయటికి పరుగులు పెట్టారు. దీంతో ఆ భవనం లో నివసిస్తున్న 75 మంది బయటకి వచ్చిన పది నిమిషాల వ్యవధిలోనే ఆ భవనం మొత్తం పూర్తిగా కుప్పకూలిపోయింది. సరైన సమయంలో స్పందించిన సదరు యువకుని మెచ్చుకున్నారు అందరు.