తెలంగాణలో నామినేటెడ్ పోస్టులకి బ్రేక్ ఇచ్చింది అందుకేనట…!

-

టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రాగానే నామినేటెడ్‌ పదవులపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయింది. పదవులు లేవు.. పందేరం లేదు. ఇంతలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడానికి కారణం అదేనని చర్చ మొదలైంది.

తెలంగాణ వచ్చాక 50కి పైగా కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. అప్పట్లో చాలా మందికి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్‌. 2018లో రెండోసారి అధికారంలోకి రావడంతో అదే రీతిన పిలిచి పదవులు ఇస్తారని చాలా మంది ఆశించారు. రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి… చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయింది. కళ్లు కాయలు కాస్తున్నాయే కానీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఊసే లేదు.

గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ పోస్టుల దగ్గర నుంచి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయడం లేదు. ఎందుకిలా జరుగుతుందా అని ఆరా తీసిన వారికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయట. అందుకే నామినేటెడ్‌ పోస్టు భర్తీ జోలికి వెళ్లడం లేదని గ్రహించిన నాయకులు జీవగారిపోయినట్టు సమాచారం. ఒక నామినేటెడ్‌ పోస్టు భర్తీ అంటే చైర్మన్‌కు కారు.. సిబ్బందిని కేటాయించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ప్రభుత్వానికి ఆర్థిక భారమే. పైగా కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఇలాంటి సమయంలో మరింత ఆర్థిక భారం అవసరమా అన్న ఆలోచనలో పాలకులు ఉన్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news