ఇటీవల కాలంలో పలువురు ఉన్నట్టుండి గుండె జబ్బులకు గురవుతున్న వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పోలీసు శాఖ అన్ని విభాగాల వారీగా పోలీసులకు సీపీఆర్ చేయడం వంటి ప్రైమరీ చికిత్సను ఎలా అందించాలో ట్రైనింగ్ ఇచ్చింది. దాంతో రాష్ట్రంలో అక్కడక్కడా పోలీసులు పలువురు సామాన్యలను ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కాపాడిన ఘటనలు సైతం అనేకం ఉన్నాయి.
తాజాగా దసరా ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఓ యువకుడు వరంగల్ రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమం చూసేందుకు వచ్చాడు. అక్కడ జరిగిన తోపులాటలో ఓ యువకుడు గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలను కాపాడాడు.దీంతో కానిస్టేబుల్‌ను అంతా మెచ్చుకున్నారు. సీపీఆర్ చేయడం ఆలస్యమైతే ఆ యువకుడు ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.