గిన్నెలు కడగమన్నందుకు రూమ్ మేట్ ని హత్య చేసిన యువకుడు..

-

రూమ్ మేట్స్ అంటే ఓకే రూమ్ లో ఉంటూ ఒకరికొకరు ఇబ్బంది లేకుండా నివసిస్తుంటారు.సాధారణంగా రూమ్ లో ఉంటున్నాం అంటే వంట చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం వంటివి అబ్బాయిలకు పెద్ద టాస్క్ గానే మారుతుంది.అందుకే వీటిని వంతులవారీగా చేసుకుంటారు.అయితే తాజాగా గిన్నెలు కడగమన్నాడు అన్న కోపంతో ఓ వ్యక్తి తన రూమ్ మేట్ ను హత్య చేశాడు.ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే…21 ఏళ్ల నిందితుడు 28 ఏళ్ల బాధితుడు ఒకే రూమ్ లో నివసిస్తున్నారు.

శుక్రవారం రాత్రి గిన్నెలు కడగమని బాధితుడు నిందితుడికి చెప్పాడు.దాంతో ఆగ్రహానికి లోనైన 21 ఏళ్ల నిందితుడు తన రూమ్మేట్ ని హత్య చేశాడు.కత్తితో బాధితుడి చాతి కింది భాగంలో లోతైన గాయాలు అయ్యేలా దాడి చేశాడు.దాంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ తతంగం అంతటినీ కళ్లారా చూసిన మూడో రూమ్ మేట్ పోలీసులకు సమాచారం అందించాడు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పూర్తి విషయాన్ని తెలుసుకునేందుకు మూడో రూమ్మేట్ ను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.నిందితుడిని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.బాధితులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version