విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుండి జులై 8కి మార్చడం ఏంటి? : చంద్రబాబు

-

పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది..? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెకుని నాశనం చేశారు… డయాఫ్రం వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా.. టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి . విదేశీ విద్య వరకు టీడీపీ తెచ్చిన సంస్కరణల ఫలితాలను ఈ రోజు ప్రజలు ఫలితాలు చూస్తున్నారని.. జగన్ బడుగులకు చేసిందేమీ లేకున్నా.. వారిని రాజకీయంగా వాడుకుంటూ టీడీపీపై వ్యతిరేకత సృష్టిస్తున్నారన్నారు. గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమానికి నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని.. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి కూడా వీల్లేదనేలా అరెస్టులు చేస్తున్నారని చెప్పారు.

హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.? దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుండి జులై 8కి మార్చడం ఏంటి? అని నిలదీశారు. స్కూళ్లను మూసివేయడం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు… నెల్లూరులో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొంగిలించడబడడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిందన్నారు. నేరస్తులకు కొత్త కొత్తగా నేరాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం మార్గాలు చూపిస్తోంది… టీడీపీ మెంబర్ షిప్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version