యువతి ప్రాణం తీసిన తల వెంట్రుకలు..!

-

అంత ఆనందంగా ఉంది అనుకుంటున్న తరుణంలో అనుకోని ఘటన తో ఏకంగా మృత్యువు దరిచేరుతు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ యువతి ఎంతో ఆనందంగా గడుపుతున్న సమయంలో యువతి ఆనందాన్ని చూసి విధి వక్రించింది. చివరికి ప్రమాదం రూపంలో ఆ యువతి ప్రాణం తీసింది. సరదాగా గేమ్స్ ఆడేందుకు వెళ్లిన యువతి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన హైదరాబాద్ నగర శివార్లలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే శ్రీ హర్షిని అనే విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతోంది. ఇక ఇటీవలే గుర్రంగూడ లో ఉన్న ప్లే జోన్ లో సరదాగా గేమ్స్ ఆడేందుకు వెళ్ళింది సదరు యువతి. ఈ క్రమంలోనే కారులో కార్టింగ్ చేసింది. సరదాగా కార్టింగ్ చేస్తూ వెళుతున్న సమయంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. యువతి వెంట్రుకలు కారు టైర్ లో చిక్కుకోవడంతో ఒక్కసారిగా కారులోంచి ఎగిరి రోడ్డుపై పడిపోయింది యువతి. ఈ క్రమంలోనే యువతి తలకు బలంగా గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version