లారీ కింద పడిపోయిన యువతి.. బండి సంజయ్ ఏం చేశారంటే?

-

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ములుగు పర్యటన వెళ్తున్న క్రమంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా ఓ యువతి లారీ కింద పడిపోయింది.ఆమె జడ దాని టైర్ల కింద ఇరుక్కుంది. లారీ కింద యువతి పడిపోగానే డ్రైవర్ చాకచక్యంగా వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. ఆమెను లారీ కింద నుంచి బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

తీవ్రగాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కాపాడేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం తన వంతు ప్రయత్నం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఈ ఘటన సోమవారం జరిగింది. అదే సమయంటో అటుగా వెళ్తున్న బండి సంజయ్ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. ఆ దారి గుండా వెళ్తున్న లారీలను ఆపించి జాకీలు, కత్తెర తెప్పించి స్థానికుల సహాయంతో ఆమెను రక్షించారు. గాయాలపాలైన యువతిని కరీంనగర్‌లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు చెప్పారు. గాయాలపాలైన యువతిని మానకొండూర్ మండలం ఖెల్లడకు చెందిన దివ్య శ్రీగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news