దుప్పటిని పెళ్లిచేసుకున్న యువతి.. వీడియో వైరల్..!!

-

ప్రేమకు ఏజ్‌తో సంబంధం లేదంటారు.. ప్రేమకు వయసుతోనే కాదు..ప్రేమించడానికి మనిషే అయి ఉండక్కర్లేదు.. మనసుకు నచ్చినది ఏదైనా ప్రేమకు అర్హులే.. అది జంతువులు, సంగీతం, వస్తువులు ఏవైనా అంటోంది ఓ యువతి.. తాను బ్లాంకెట్‌ను ప్రేమిస్తుందట.. అక్కడితో ఆగలేదు.. ఆ బ్లాంకెట్‌నే పెళ్లి చేసుకుంది.. ఆశ్చర్యంగా అనిపిస్తుందా..? ఇది నిజమే.. బ్రిటన్‌కు చెందిన మహిళ దుప్పటిని పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది..!!
తన కుటుంబం, స్నేహితులు, ప్రియుడి ఎదుటే తన దుప్పటిని పెళ్లి చేసుకుంది బ్రిటన్ మహిళ.. మొదటి చూపులోనే ఆ దుప్పటిని ఇష్టపడిందట..ఆమె పేరు పాస్కల్ సెలిక్. డైలీ స్టార్ నివేదించిన ప్రకారం, ఆమె ఇంగ్లాండ్‌లోని ఎక్సెటర్‌లో దుప్పటిని వివాహం చేసుకుంది.. ఈ వివాహనికి.. కుటుంబంతో సహా తన ప్రియుడిని కూడా ఆహ్వానించింది.. ఒక టీవీ షోలో, పాస్కల్ మాట్లాడుతూ.. చాలా దుప్పట్లు ఉన్నప్పటికీ, ఇది తనకు అత్యంత సౌకర్యాన్ని మరియు వెచ్చదనాన్ని ఇస్తుందని తెలిపింది..
ఆ దుప్పటి ఆమెకు స్నేహితుడిలాంటిదట… దుఃఖంలోనూ, సంతోషంలోనూ అది తన పక్కనే ఉంది.. నిజానికి మనకు కూడా పిల్లోతో చాలా ఎమోషనల్‌ రిలేషన్‌ ఉంటుంది.. ఎన్నో రాత్రులు పడుకోని దుప్పటిముసుగులో ఏడ్చుకున్న రోజులు ఉండే ఉంటాయి.. మన బాధ అప్పుడు ఆ పిల్లోకి, దుప్పటికే తెలుస్తుంది..! పాస్కల్‌ కూడా అంతేనట..
వివాహం చేసుకోవడం పాస్కల్ స్వీయ-ప్రేమకు చిహ్నం లాంటిదే.. చాలామంది ఎవరూ తనను ప్రేమించడం లేదని తెగ ఫీల్‌ అవుతారు.. ఎవరో ఎందుకు ప్రేమించాలి..మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి.. మీ గురించి మీరు తెలుసుకున్నప్పుడే..మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. టక్కున మీరు ఈ ప్రపంచంలో అతిగా ఇష్టపడే వ్యక్తులు పేర్లు చెప్పమంటే మీరు ఏం చెప్తారు.. చాలామంది తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌, లవర్‌ పేరును అనుకుంటారు.. కానీ ఆ లిస్ట్‌లో మిమ్మల్నిపెట్టుకోవడం మర్చిపోతారు..! ఎంత విడ్డూరం కదా.. మిమ్మల్నీ మీరే ప్రేమించకుంటే.. ఇతరులు ఎలా ప్రేమిస్తారు..? మొత్తానికి ఈ దుప్పటిని పెళ్లిచేసుకున్న వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version