ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతో మంది పై పంజా విసురుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే కొంత మంది ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటే మరి కొంతమందికి భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఇటీవలే ఓ విద్యార్థి పై కూడా కరోనా వైరస్ పంజా విసిరింది. సరిగ్గా పరీక్ష జరిగే సమయంలో కరోనా వైరస్ బారిన పడిన ఆ యువతి ఎక్కడ నిరాశ చెందలేదు. ఓవైపు కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్తో పోరాడుతూనే.. ఎంతో పట్టుదలతో పరీక్ష రాసింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగింది ఈ ఆసక్తికర ఘటన.
కరోనా వైరస్ బారిన పడిన యువతి ఏకంగా ఆంబులెన్స్ లోనే పరీక్ష రాసి ప్రశంసలు అందుకుంటోంది. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షల కోసం ఎన్నో రోజులనుంచి గోపిక గోపన్ అనే యువతి సిద్ధమవుతోంది. ఇక సోమవారం పరీక్షలు జరగాల్సి ఉన్న సమయంలోనే.. యువతికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఏకంగా ఆంబులెన్స్ లోనే పరీక్ష రాసింది ఆ యువతి. ప్రాణాంతకమైన వైరస్ తో పోరాడుతూనే పట్టుదలతో పరీక్ష రాసిన ఆ యువతిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.