అలా చేయడానికి సిద్ధమైన అదాశర్మ..!

-

హార్ట్ ఎటాక్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన ఆదాశర్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. సోషల్ మీడియా వేదికగా ఎన్నో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులందరికీ మతి పోగొట్టింది . ప్రస్తుతం ఆదా శర్మ ప్రధాన పాత్రలు క్వశ్చన్ మార్క్ అనే సినిమా తెరకెక్కుతుంది.

శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆద శర్మ పాత్ర ఎంతో డిఫరెంట్గా ఉండబోతుంది అన్నది అర్ధమవుతుంది అయితే ఈ సినిమాలో ఓ సరికొత్త ప్రయోగం చేసేందుకు ఆదాశర్మ సిద్ధమైందట. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన నటించిన సినిమాల్లో పాత్రలకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పేవారు కానీ క్వశ్చన్ మార్క్ సినిమాలో మాత్రం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్ధమైందట. ఆ పాత్రకు ఆదా శర్మ డబ్బింగ్ చెబితేనే సరైన న్యాయం జరుగుతుందని దర్శకుడు భావించడంతో ఈ అమ్మడు కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version