సినిమా తీయడానికి మేకల దొంగతనం చేస్తూ దొరికారు, ఎంత తెలివో చూడండి…!

సినిమా తీయలనుకున్నారు… కాని డబ్బులు లేవు. అందుకే ఒక కొత్త ప్లాన్ వేసారు. ఇద్దరు సోదరులు తమ తండ్రి తో కలిసి సినిమా చేయడానికి మేకలను దొంగతనం చేసి నిధులు సమకూర్చుకోవడం సంచలనం అయింది. మాధవరం పోలీసులు శనివారం వారిని అరెస్టు చేసారు. గత మూడు సంవత్సరాలుగా న్యూ వాషర్‌మెన్‌ పేట్‌ కు చెందిన వి నిరంజన్ కుమార్ (30), అతని సోదరుడు లెనిన్ కుమార్ ( 32)మేకలను దొంగాలిస్తున్నారు.

goat

వారు రోజుకు ఎనిమిది నుండి పది మేకలను దొంగిలించి ఒక్కొక్కటి ₹ 8,000 కు అమ్మారు. చెంగల్‌ పేట్, మాధవరం, మిన్జూర్ మరియు పొన్నేరి చుట్టూ మేకలను మేపే ప్రదేశాల్లో తిరిగి… ఎవరూ చూడకుండా ఒకటి లేదా రెండు పట్టుకుని వారి కారులో పెట్టుకుని పారిపోతూ ఉండే వారు. చాలా ప్రదేశాల్లో ఇలాగే చేసారు. అయితే ఎక్కువ దొంగాలిస్తే అనుమానం వస్తుందని భావించి ఒకటి లేదా రెండు మాత్రమే దొంగతనం చేసే వారు. అయితే ఒక వ్యక్తి రెండు మేకలను పోగొట్టుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అక్టోబర్ 9 న వారు దొరికాయి. పళని అనే వ్యక్తికి ఆరు మేకలు ఉండగా అందులో వీళ్ళు ఒకటి దొంగతనం చేయగా పోలీసులు పట్టుకున్నారు.