కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారు. ఆయన చరిత్రలో తెలిపేవిధంగా ఉన్న గదుల్లోకి వెళ్లనివ్వడం లేదని.. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అక్కడికీ వెళ్లలేదని తెలిపారు.
బీజేపీ ఒత్తిడి మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విగ్రహ నిర్మాణం పూర్తి చేసింది. అంబేద్కర్ కు సంబంధించిన పంచ తీర్థాలను రాహుల్ గాంధీ దర్శనం చేసుకోవాలి. అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక చాలా అనుమానాలు వస్తున్నాయి. సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ ఆంధ్రాకు తరలి వెళ్లితే తెలంగాణకే నష్టం అన్నారు. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడకుండా వారి అధిష్టానం అదుపులో పెట్టాలని బండి సంజయ్ పేర్కొన్నారు.