రైస్ బ్రాన్ అయిల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలియక సైడ్ చేశారా.?

-

వంటనూనెల్లో బోలెడు రకాలు ఉన్నాయి..బడ్జెట్ లో వచ్చేదే మనం తీసుకుంటాం.. మన బడ్జెట్ లోనే మంచి ఆయిల్స్ చాలా ఉన్నాయి. ఎన్నో ఏళ్లగా ఒకటే ఆయిల్ కు అలవాటు పడిన వారు.. అసలు మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఆయిల్స్ ను పట్టించుకోరు. ఆరోగ్యానికి మేలు చేసే ఆయిల్స్ మస్త్ ఉన్నాయి. అందులో ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్. ఆసియన్ దేశాల్లో వంటల్లో ఎక్కువగా ఇదే వాడతారు. మన దేశంతో పాటు.. జపాన్‌, చైనాలోనూ రైస్ బ్రాన్ అయిల్ ను అధికంగా వినియోగిస్తున్నారు. ఈ నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు గుర్తించారు. ఈరోజు మనం ఈ నూనె ఎలా తయారు చేస్తారు, ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో చూద్దామా..!

రైస్ బ్రాన్ ఆయిల్ ఎలా చేస్తారంటే.
వరిని ఎండ బెట్టి రైస్‌ మిల్లాడించే సమయంలో తవుడు రూపంలో కొంత బయటకు వస్తుంది. దీనిని జంతువులకు దాణాగా వాడతారు. మిగిలినదాన్ని వేస్ట్ జిగా పారేస్తుంటారు. అయితే ఈ నిరుపయోగమైన దానిలో ఎన్నో పోషకాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించి దాని నుండి నూనె తీయటం ప్రారంభించారు. అదే రైస్ బ్రాన్ ఆయిల్ అయింది.
రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల లాభాలు
రైస్‌ బ్రాన్ ఆయిల్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ వంట నూనె లిపిడ్ ప్రొఫైల్, మెటబాలిక్ సిండ్రోమ్‌ను ప్రభావితం చేస్తుంది.
రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది.
రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉండే కార్డియాక్ ఫ్రెండ్లీ ఫైటోకెమికల్స్ , యాంటీఆక్సిడెంట్‌లు గుండెకు మేలు చేస్తాయి.
అందుకే గుండె ఆరోగ్యకరమైన నూనె హోదాను రైస్ బ్రౌన్ అయిల్ సొంతం చేసుకుంది.
జీవనశైలి మార్పు , ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు రైస్ బ్రాన్ ఆయిల్‌ను రోజువారీగా చేర్చడం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది.
రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఓరిజానాల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, కొలెస్ట్రాల్ విసర్జనను పెంచుతుందట.
రైస్ బ్రాన్ ఆయిల్ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
రైస్ బ్రాన్ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్ నష్టాలను ఎదుర్కోవడం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీసే ఫ్రీ రాడికల్‌ను తటస్థీకరించి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.
ఇంకా ఈ అయిల్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్, పాలీశాకరైడ్స్, మినరల్స్, మెగ్నీషియం, సెలీనియం, జింక్, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ట్రేస్ మినరల్స్ శక్తివంతమైన మొక్కల సమ్మేళనాలు.. ఇవి ఇన్‌ఫెక్షన్లను అరికట్టడానికి తోడ్పడతాయి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాపు,నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగం టైప్ 2 డయాబెటిస్ రోగులలో రక్తంలో చక్కెర స్పైక్‌లను 30% గణనీయంగా తగ్గించిందని పేర్కొన్నారు. ఒరిజానాల్, టోకోట్రినాల్‌లు రైస్ బ్రాన్ ఆయిల్‌లో క్రియాశీల సమ్మేళనాలు.. ఇవి రక్త నాళాలు, గుండె పొరను దెబ్బతీసే వాపును కలిగించే అనేక ఎంజైమ్‌ల ప్రభావాన్ని తగ్గించటంలో తోడ్పడతాయి.
రైస్ బ్రాన్ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్ల సమూహం టోకోట్రినాల్స్ బలమైన క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయి. రొమ్ము, ఊపిరితిత్తులు, అండాశయం, కాలేయం, మెదడు,ప్యాంక్రియాస్‌లో క్యాన్సర్‌గా ఏర్పడే కణాల పెరుగుదలను టోకోట్రినాల్స్ నియంత్రిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version