పాక్ మీద భారత్ అటాక్.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు

-

పహెల్గాం ఉగ్రదాడికి భారత్ పాక్ మీద ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా కీలక ఆదేశాలు జారీచేశారు. ఆపరేషన్ సిందూర్‌లో రాజకీయాలకు తావు లేదన్నారు. అత్యవసర సర్వీస్‌లకు సెలవులు రద్దు చేశారు.పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల వారు అక్రమంగా ఇక్కడ నివసిస్తుంటే వెంటనే వారిని అరెస్టు చేయాలన్నారు.

ఉద్యోగులు, మంత్రులందరూ అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అత్యవసర మెడిసిన్, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు.

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలన్నారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలన్నారు. సైన్యానికి సంఘీభావంగా రేపు ర్యాలీ సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించాలన్నారు.ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news