అందుబాటులో 43 వేలకుపైగా ఆయుష్మాన్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు

-

ఆయుష్మాన్​ భారత్ పథకం అమలుపై కీలక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 43,022 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు(హెచ్​డబ్ల్యూసీ) పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తెలిపింది. కరోనా కాలంలోనే(జనవరి నుంచి జులై వరకు) 13,657 హెచ్​డబ్ల్యూహెచ్​సీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.

ayushman

ఆరోగ్య కేంద్రాల ద్వారా జులై 18 నుంచి 24 మధ్య కాలంలోనే 44.26 లక్షల మంది చికిత్స పొందారని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. దేశంలో హెచ్​డబ్ల్యూసీల పనితనానికి ఇదే నిదర్శమని.. కరోనా రహిత సేవలను అందించడంలో హెచ్​డబ్ల్యూసీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వివరించింది. గత వారం రోజుల్లో 3.83 లక్షల రక్తపోటు, 3.14 లక్షల డయాబెటిస్‌, 1.15 లక్షల నోటి క్యాన్సర్‌, 45 వేల రొమ్ము క్యాన్సర్‌, 36 వేల గర్భాశయ క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.ఆయుష్మాన్​ భారత్​ హెచ్​డబ్ల్యూసీల్లో గతవారం దేశవ్యాప్తంగా 32 వేల యోగా సెషన్​లు నిర్వహించామని పేర్కొంది ఆరోగ్యశాఖ. మొత్తంగా యోగా సెషన్​ల సంఖ్య 14.24 లక్షలకు చేరిందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version