అక్కడ పెళ్లిళ్లు, అంత్యక్రియలకు నేటికీ పళ్లు నల్లగా చేసుకుంటారట…!

-

ఇప్పుడు ఇలా ఉంది కానీ.. కొన్ని వేల సంవత్సరాల మానవ నాగరికత చాలా వింతగా ఉండేది. ఏవేవో ఆచారాలు పాటించేవాళ్లు. ఇప్పుడు ఆ ఆచారాలు వింటే మనకు కచ్చితంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈరోజుకు కొన్ని తెగలు వింత ఆచారాలను సంప్రదాయల పేరిటే మోస్తూనే ఉన్నారు. లైఫ్‌లో ఒక్కసారే స్నానం చేయాలి, శోభనం మూడు రోజులు రూంలోంచి బయటకు రాకూడదు, పెళ్లికి ముందే తల్లి అవ్వాలి ఇలాంటి ఆచారాలకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం.. ఇది ఇంకాస్త వెరైటీ.. ఆ దేశంలో ప్రజలు ఏదైనా ప్రత్యేకమైన రోజు అయితే దంతాలకు నల్ల రంగు వేసుకుంటారట.. ఇదేంట్రా బాబు.. ఎవరైన ఫంక్షన్‌ అంటే..అందంగా మేకప్‌ వేసుకుంటారు..ఇలా పళ్లు నల్లగా చేసుకోవడం ఏంటి..?ఈ ముచ్చటేందో మీరు చూసేయండి.!
జపాన్ దేశంలో హీయన్ కాలంలో ఈ ప్రత్యేకమైన ఆచారం అమలులో ఉండేది.. అతి పురాతనమైన ఈ ఆచారాన్ని అప్పట్లో ఒహగురో అని పిలిచేవారు. ఈ ఒహగురో ఆచారాన్ని జపాన్‌తో పాటు, చైనా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాల్లో కూడా పాటించేవారట.. ముఖ్యంగా 794వ సంవత్సరం నుండి 1185వ సంవత్సరం వరకు ఉన్నట్లు చరిత్రకారుల మాట.. ఈ ఒహగురో సంప్రదాయాన్ని పాటించిన ఆ నాటి యువతీ యువకులు తమ పళ్లు నల్లబడేలా చేసుకునేవారు.. తద్వారా వారు యవ్వనంగా ఉంటారని వారి నమ్మకం.

చరిత్రకారులు ఏం అంటున్నారంటే..

ఈ విధానం ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా ఉండేది. ఇలా నల్లరంగు వేసుకోవడం వలన దంతాల మీద సూక్ష్మక్రిములు లేకుండా చేస్తుందట.. చిగుళ్ళను రక్షిస్తుంది. నోటికి ఎటువంటి హాని కలిగించదు. ముఖ్యంగా పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ తెల్ల దంతాలను నల్లగా మార్చుకునేవారట.
పురాతన కాలంలో దంతాలు నల్లబడటం అనేది జ్ఞానం, అందం చిహ్నంగా పరిగణించబడేదట.. వామ్మో ఇదీ మరీ బాగుందిగా..సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. ఆనాటి రాజకుటుంబాల చెందిన వ్యక్తులు కూడా తమ దంతాలకు నల్లటి రంగును వేసుకునేవారు. ముఖ్యంగా వివాహం లేదా అంత్యక్రియల వంటి సందర్భాలలో కూడా ప్రజలు తమ దంతాలను నల్లగా చేసుకునేవాళ్లు. నేటికీ, జపాన్‌లోని గీషా జిల్లా మహిళలు ప్రత్యేక సందర్భాలలో తమ దంతాలను నల్లగా చేసుకుంటారట. ఎవరి నమ్మకం వారిది..తెలుసుకోవడం తప్ప మనం ఏం చేయలేం కదా.. ఇంతకీ మీకు కూడా ఇలానే ఏదైనా వెరైటీ ఆచారాలు తెలుసా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version