అక్కడ పెళ్లి మంత్రాలతో పాటు కరోనా నియంత్రణ సూత్రాలు..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మరి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా శుభకార్యాలు వాయిదా పడిన సంగతి విదితమే. ఇక లాక్ డౌన్ సడలింపులతో కోవిడ్ నియమాలను పాటిస్తూ శుభకార్యాలు చేయడానికి అనుమతిని ఇచ్చింది.

marriage

తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రం బాగేశ్వర్ జిల్లాలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నూతన వధువరుల పెళ్లి జరుగుతుండగా.. అక్కడి ఆ జిల్లా ఎస్పీ మణికాంత్ మిశ్రా వచ్చి వేదికపైకి వెళ్లారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పక్కన కూర్చున్నారు. వేద మంత్రాలు చదువుతున్న పూజారితో తాను పూజారిలా మారారు. అయితే ఆయన చదివింది వేద మంత్రాలు కాదు.. కరోనా నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల సూత్రాలు. తాను చేసిన పనిపై స్పందించిన ఎస్పీ ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు ఎన్నో చర్యలు చేపడుతున్నాయని అన్నారు.

అయితే పోలీసులు నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూస్తున్నామని ఎస్పీ తెలియజేశారు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక సందర్భమని, ఆ సమయంలో కరోనా నియంత్రణ చర్యలు చెబితే అవి అందరికి బలంగా చేరుతాయని, పెళ్లి తంతులో కరోనా నియంత్రణ సూత్రాలు చదివించామని వివరించారు. పూజారులు కూడా తర్వాతి రోజుల్లో పెళ్లి తంతుతో పాటు కరోనా నియంత్రణ చర్యలను వధువరులతో చెప్పించాలని కోరారు. ఎస్పీ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Read more RELATED
Recommended to you

Exit mobile version