వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దుద్దిల్ల మండలం లగచర్ల గ్రామంలో ఇటీవల కలెక్టర్, అధికారులపై దాడి ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా లగచర్ల గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. మీరు సచ్చినా మీ భూములు మీకు దక్కవని బెదిరించారు. కలెక్టర్ పై దాడి వెనక కుట్ర అనడంలో ఎలాంటి నిజం లేదు. లగచర్లలో మాకు భూములు లేవన్న వాదనలో ఎలాంటి నిజం లేదు. లగచర్ల గ్రామంలో మొత్తం 1200 ఎకరాల భూములు పోతున్నాయి. మా భూమి 15 ఎకరాలు ఉందని తెలిపింది.
మా దగ్గరికి ఎవ్వరికీ వచ్చి మాట్లాడలేదు. డైరెక్ట్ గా ఊరికి వచ్చి మా గిరిజన వాళ్లు ఎవ్వరూ చదువుకోలేదు. వాళ్లకు అసలు కలెక్టర్ వస్తున్న విషయం కూడా తెలియదు. కలెక్టర్ వచ్చినప్పుడు గో బ్యాక్ కలెక్టర్ అంటూ నినాదాలు చేశారు. అయితే కలెక్టర్ పోలేదు. అసలు కలెక్టర్ పై చేతి కూడా లేపలేదు. ఎవ్వరిపై దాడి చేయలేదని.. దాడి చేయాలని ఎవ్వరూ చేయలేదు.