నటి జత్వని కేసుపై కోర్టులో విచారణ.. బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్..!

-

ముంబై నటి జత్వని కేసు పై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసాడు నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్. నటి జత్వని తరుపు వాదనలు వినిపించిన న్యాయవాది నర్రా శ్రీనివాసరావు.. నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేస్తాడు అని వాదించారు. నిందితుడికి కేసులో ఐపిఎస్ అధికారులు సైతం సహకరించారన్న న్యాయవాది నర్రా.. నిందితుడిని పోలీసులు డెహ్రాడూన్ లో పట్టుకున్నారు అని తెలిపారు.

అలాగే తప్పుడు పత్రాలు సృష్టించి బాధితులను అన్యాయంగా 42 రోజులపాటు జైలులో ఉంచారన్న న్యాయవాది నర్రా.. నిందితుడు విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేస్తే కేసులో వాస్తవాలు బయటకు రావని పేర్కొన్నారు. అలాగే నిందితుడు పారిపోయే అవకాశం కూడా ఉందన్నారు న్యాయవాది నర్రా. అయితే ఈనెల 16న కేసులో బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ ఇవ్వనుంది జిల్లా కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news