అయోధ్యలో కేఎఫ్సీ.. కానీ నాన్వెజ్ ఉండదు

-

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం లో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము జరిగినప్పటి నుంచి , బాల రాముని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది.రోజుకు సగటున 2 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. దీని కారణంగా రెస్టారెంట్లు , హోటల్స్ సహా ఇతర వ్యాపారాలు పెరిగాయి.

 

డొమినోస్, పిజ్జా హట్ వంటి చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు అయోధ్యలో తమ ఔటులేట్లను తెరవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ ఐటెమ్‌లకు ప్రసిద్ధి చెందిన అమెరికన్ ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ కేఎఫ్‌సీ తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. అయితే.. అయోధ్యను మాంసాహార ప్రాంతంగా ప్రకటించడంతో కేఎఫ్‌సీ తన మెనూని మార్చుకోవలసి ఉంటుంది. రామ మందిరం చుట్టూ దాదాపు 15 కి.మీ ఉన్న పంచ్ కోసి మార్గ్ పరిధిలోని ప్రాంగణంలో మాంసం, మద్యం అమ్మకాలను అధికారులు అనుమతించరు.

రామ మందిరం చుట్టుపక్కల నాన్ వెజ్ తెరవడానికి అనుమతి లేకపోవడంతో అయోధ్య-లక్నో హైవేపై KFC తన యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ వెల్లడించారు.కేఎఫ్‌సీ శాఖాహార వస్తువులను మాత్రమే విక్రయించాలని నిర్ణయించుకుంటే, ఆ నిబంధనని తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఆలయ పరిధిలో KFC శాకాహార పదార్థాలు అమ్మితే ఎటువంటి అభ్యంతరం లేదు అని విశాల్ సింగ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news