రాజకీయాల్లోకి విజయ్ రావడం మంచి నిర్ణయం: ఉపాసన కొణిదెల

-

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావడం మంచి నిర్ణయమని ఉపాసన కొణిదెల అభిప్రాయము వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అతను తమిళ ఇండస్ట్రీలో గొప్పగా రాణించారు. ఇప్పుడు ప్రజల మనసులో స్థానం సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చారు. నా మామయ్య (మెగా స్టార్ చిరంజీవి), అంకుల్ (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్) కూడా రాజకీయాల్లో ప్రవేశించారు. చాలా మంది గొప్ప ముఖ్యమంత్రులు సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నవారే’ అని అన్నారు.

 

ఎప్పుడెప్పుడా అని ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ పొలిటికల్ అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దళపతి విజయ్ శుభ వార్త చెప్పిన విషయం తెలిసిందే.ఇక ఈ పార్టీకి “తమిళ వెట్రి కజగం” అనే పేరు ఖరారు చేశారు హీరో విజయ్ .2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్‌ తెలిపారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని సంతోషం, మరో పక్క సినిమాలకు దూరమవుతాడు కావొచ్చని అభిమానులు బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news