బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో వరి అవసరం లేదన్నారు.. దేశంలో ఎవరూ ఆకలితో చనిపోవడం లేదని బాంబు పేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు భారీగా పెరిగిపోయిందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

గుజరాత్, యూపీల కన్నా తెలంగాణలోనే సాగు ఎక్కువ అని పేర్కొన్నారు. వీలైనంత వరకు తెలంగాణ రైతులు వరి సాగు తగ్గించాలని కేంద్రం కూడా తెలిపిందని వివరించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
తెలంగాణలో వరి అవసరం లేదు
దేశంలో ఎవరూ ఆకలితో చనిపోవడం లేదు – బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి pic.twitter.com/fPblmF5ySV
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025