ఆ రెండు చట్టాలపై స్టే లేదు, సుప్రీం కీలక వ్యాఖ్యలు…!

-

దేశంలో వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)పై స్టే విధించడానికి గాను సుప్రీం కోర్ట్ నిరాకరించింది. దీనితో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీఏఏకి సంబంధించిన పిటిషన్లను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం, ఐదు వారాల తర్వాత రాజ్యాంగ ధర్మాసనం,

ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా సీఏఏ వ్యవహారాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపు న్యాయవాది వేణుగోపాల్‌ ఆరు వారాల సమయం కోరడంతో న్యాయవాది కపిల్‌ సిబల్‌ అభ్యంతరం వ్యక్తం చేసారు. అసోం, త్రిపుర పిటిషన్లను కలిపి వింటామని,

వీటిపై సహకరించాల్సిందిగా కపిల్ సిబల్‌ను విజ్ఞప్తి చేసింది కోర్టు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వంతో పాటు మొత్తం పిటిషనర్లందరికీ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సీఏఏపై మున్ముందు సుప్రీంకోర్టులో విచారణ కోరదల్చుకున్న అన్ని అంశాలను సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్ట్ లకు కీలక ఆదేశాలు జారి చేసింది. సీఏఏపై ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలూ జారీ చేయరాదంటూ అన్ని హైకోర్ట్ లకు ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version