ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసుల హవా కొనసాగుతూనే ఉంది. అమరావతి ఉద్యమాన్ని అదుపు చేయడానికి గాను పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పై అధికారుల ఆదేశాలతో లాఠీ చార్జ్ లు కూడా చేస్తున్నారు పోలీసులు. దీనితో పోలీసుల తీరుపై ఇప్పుడు అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు తెలుగుదేశం నేతలు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఒక వ్యవహారం చోటు చేసుకుంది. విద్యార్థులను మాత్రం చెట్ల కిందకు పంపించి పోలీసులు పాఠశాలలో వసతి తీసుకున్న ఘటన అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో చెట్టు కింద విద్యార్థుల దృశ్యాలను మీడియా చిత్రీకరించింది. దీనితో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒక్కో మీడియా సంగతి చూస్తామని,
డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి హెచ్చరి౦చారట. త్వరలోనే నోటీసులు ఇచ్చి సంగతి చూస్తామని, మీరు ఇబ్బందులు పడేరోజు త్వరలోనే ఉందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు పాఠశాలలో వసతి తీసుకుంటే తప్పేంటని మీడియాని ప్రశ్నించారు. చెట్ల కింద ఉన్న పిల్లల్ని హుటాహుటిన లోపలికి పంపి మీడియాను ఎందుకు అనుమతించారని అక్కడ ఉన్న సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసారు.