ఉగాది పండుగ పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు రవీంద్రభారతిలో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరయ్యారు. వారి వెంట మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సైతం ఉన్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ది విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టంచేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఆ విషయంలో తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.