పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి కు వివరించారు. టెక్స్ టైల్స్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్ పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తుమన్నామని ముఖ్యమంత్రి కు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.