హైదరాబాద్ లో మరో అన్నగా ఉంటా.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి

-

హైదరాబాద్ లో మరో అన్నగా ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నియోజకవర్గం గూగూస్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసిందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ధీమా వ్యక్తం చేసారు.

దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ షిండే అజిత్ పవార్ కాలరాశారని పేర్కొన్నారు. షిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రాపూర్ లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మేజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు. హైదరాబాద్ లో మరో అన్నగా నేను ఉంటానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version