టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ గా ఇటీవల రోహిత్ ను నియమిస్తు బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ స్పందించాడు. కోహ్లి స్థానంలో రోహిత్ ను కెప్టెన్ గా నియమించడం తో రోహిత్ పై ఒత్తిడి ఉంటుందని అన్నాడు. అలాగే టీమిండియా అభిమానులు నుంచి కూడా రోహిత్ పై భారీ గా ఆశలు ఉంటాయని తెలిపాడు.
అయితే టీమిండియా ను టీ 20 లలో వన్డే లలో సమర్థ వంతం గా నడింపించే శక్తి రోహిత్ శర్మ కు ఉంటుందని అని అన్నారు. అలాగే నూతనం గా కెప్టెన్ ఎన్నిక అయినందుకు రోహిత్ కు శుభాకాంక్షలు కూడా తెలిపాడు. అయితే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ ని తప్పించి రోహిత్ శర్మ ను నియమించడం పట్ల పలువురు సీనియర్లు స్పందించారు. బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. రోహిత్ ను కెప్టెన్ చేసిన ఫలితం త్వరలోనే కనిపిస్తుందని తెలిపారు.