హైదరాబాద్ లో ప్రభాస్ కొత్త ఇల్లు..ధర ఎంతంటే..?

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త ఇల్లును కొన్నారు.ప్రభాస్ హైదరాబాద్ లోనే కొత్త ఇల్లు కట్టించునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటిని ఎయిర్ పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండటం తో పాటు నానక్ రామ్ గూడలోని సినీ విలేజ్ లో ప్రభాస్ ఇంటి కోసం రూ. 120 కోట్ల తో రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఆ స్థలం లోనే ప్రభాస్ రూ.80 కోట్లు పెట్టి విల్లాను నిర్మించాలనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రభాస్ ఇటీవల ముంబై లో కూడా ఓ లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో టాప్ హీరో గా రాణిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రాధే శ్యామ్ సినిమా పూర్తయ్యింది. ఇది ఇలా ఉండగా ఆది పురు ష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతే కాకుండా నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ లతో కూడా భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news