పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు. ఎవరితో రాసి పెట్టింటే వారితోనే జరుగుతుంది.మనం ఎంత వద్దని అనుకున్నా కూడా జరిగేది జరగకుండా ఆగదు..అయితే గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకొని వెళ్తాము కానీ నీళ్ళు తాగించలేము కదా..అలా కొన్ని రాశుల వారికి సహజీవనం అంటే చాలా ఇష్టమట..పెళ్ళికి దూరంగా ఉంటారు.వాస్తవానికి వీళ్ల మనసు మాత్రం సల్పకాలిక సంబంధాలపైనే ఉంటుందంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ముఖ్యంగా ఈ ఐదు రాశులవారు ఈ కోవకు చెందుతారాని చెబుతారు.
మేషం
దీర్ఘకాలకి సంబంధాలంటే మేష రాశివారికి చెడ్డ చిరాకట. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సంసార జీవితాన్ని భారంగా భావిస్తారట. భావోద్వేగాలు, సంబంధాల కన్నా ఏకాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు..బాగా ప్రేమను చూపిస్తారు. అది కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే..ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ టైపు..
మిథునం
ఈ రాశి వారికి ఎదుటి వారి ప్రభావం వీరిపై పెద్దగా ఉండదు. పక్కోళ్లు చెప్పారు కదా అని ఫాలోఅవరు..అంతెందుకు మెదడు చెప్పింది కూడా వినరు కేవలం మనసు చెప్పిన విషయాలనే పరిగణలోకి తీసుకుంటారు. వీరి అభిరుచులు, అలవాట్లు మారుతూ ఉంటాయ్. ఏ విషయంలో మనోహరంగా ఉంటారన్నది గ్యారంటీ ఉండదు…కేవలం జీవితంలో రొమాన్స్ మాత్రమే వుంటే బెస్ట్ అనుకుంటారట..
సింహం
వీళ్ళు ఒకరి కింద బ్రతికరు..సోలో గా వుండాలని అనుకుంటారు. భార్యలను ప్రేమగా చూసుకోరు.కానీ స్వల్పకాలిక సబంధాలు, సరదా కోసం రొమాన్స్ అంటే ఇష్టం. అందుకే పెళ్లికన్నా సహజీనవంపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది..
ధనస్సు
ధనస్సు రాశివారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. వీరికి బంధం అంటే బంధిఖానాలా ఫీలవుతారు. అంటే ఒకరి చెప్పుచేతల్లో ఉండటం, వారికి నచ్చనట్టు నడుచుకోవాలనే ఫీలింగ్ అస్సలు నచ్చదు. నచ్చితే రిలేషన్ లేకుంటే పిచ్చ లైట్ అని అనుకుంటారు.
కుంభం
కుంభ రాశివారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి కూడా కుటుంబ బంధాల్లో చిక్కుకుపోవడం ఇష్టం ఉండదు కానీ బాధ్యతల నుంచి పారిపోరు. తమ బాధ్యతను నెరవేరుస్తూనే తమ ఇష్టాయిష్టాలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చుకుంటారు..వీళ్ళు నచ్చిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.. ఒకరిని పూర్తిగా నమ్మరు.అందుకే డేటింగ్ కు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు..
పైన తెలిపిన రాశుల వాళ్ళు పెళ్ళికి ఇంట్రెస్ట్ చూపించరు..