ఇలాంటి వాళ్ళ ఆదర్శం ఉంటే ఎన్ని కరోనాలు ఐనా జయించగలం !

-

కరోనా వైరస్ వల్ల అనేకమంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు మరియు పేదవాళ్ళు ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నా కానీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమాజంలో చాలామంది సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు బతికే పేద వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో లండన్ లో తొంభై తొమ్మిది సంవత్సరాల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ తుంటి ఎముక విరిగి ఓ స్టాండ్ సహాయంతో కరోనా వైరస్ బాధితుల కోసం ఇంటి నుండి బయటకు వస్తూ విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధుల సేకరణ కోసం తన ఇంటి చుట్టుప్రక్కల గార్డెన్ చుట్టూ 25 మీటర్ల దూరాన్ని 100 సార్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు తనను ప్రోత్సహించేందుకు విరాళాలు ఇవ్వాలని ఆయన సోషల్ మీడియా ద్వారా కోరారు.

 

మూర్ ప్రయత్నానికి ముగ్ధులైన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆయనకు విరాళాలు అందచేశారు. ఇప్పటివరకు మూర్‌కు 12 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.100కోట్ల పైనే విరాళాలు సమకూరాయి. ఇక ఈ విరాళాన్ని ని ఎన్ హెచ్ ఎస్ సంస్థకు అందించారు. దీంతో ఈ వార్త లండన్ లో సంచలనంగా మారింది. చాలామంది ఇలాంటి వాళ్లు ఆదర్శంగా ఉంటే ఎన్ని కరోనా వైరస్ లు వచ్చిన జయించగలం అని నెటిజన్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version