విజయసాయి రెడ్డి టార్గెట్ అదేనా…?

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆడిటర్ అయినా సరే ఆయన మాత్రం రాజకీయాల్లో ఇప్పుడు అపర చాణక్యుడు అయిపోయారు. వైఎస్ జగన్ కి ఆయన అత్యంత సన్నిహితుడు. వైఎస్ బ్రతికి ఉన్న నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన జగన్ కి అండగా ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో మీడియాలో ఎక్కువగా ఏపీ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తమవుతుంది. పరిస్థితి క్రమంగా మారుతుంది…

ఈ తరుణంలో మీడియా కథనాల ఆధారంగా అధికార పార్టీ మీద చంద్రబాబు సహా టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. దీనితో విజయసాయి రెడ్డి ఆ ఆరోపణలను తీవ్రంగా తిప్పికొట్టడమే కాకుండా మీడియా దృష్టిని కూడా మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపి నేతల మీద, టీడీపీ నేతల మీద సమయం సందర్భం లేకుండా ఆయన విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఎక్కువ వ్యాఖ్యలు చేసారు.

ఇక విశాఖలో ఎక్కువగా ఉంటున్న ఆయన ఇప్పుడు మీడియా ను సమర్ధవంతంగా డైవర్ట్ చేస్తున్నారు. కరోనా కట్టడిలో వాలంటీర్ల పాత్రను ఆయన కీర్తించడం తో సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చింది. దీనిపై విజయసాయి రెడ్డి వేగంగా మాటలను డైవర్ట్ చేసారు. ఇక బిజెపి కూడా ఆయన ట్రాప్ లో పడి నిన్న ఆయనకు సమాధానం ఇవ్వడం గమనార్హం. దీనిపై పలువురు పరిశీలకులు ఆశ్చర్య౦ వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version