ఏపీకి చంద్రబాబు ఒక విలన్ – సజ్జల రామకృష్ణారెడ్డి

-

ఏపీకి చంద్రబాబు ఒక విలన్ అని…పూర్వం సినిమాల్లో కరడు గట్టిన విలన్లను చూసేవాళ్లమని చురకలు అంటించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మెరుగైన సమాజం కావాలంటే మళ్లీ జగన్ సీఎం కావాలని.. ఈ ఐదేళ్లలో మన ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… 2014-19కు మధ్య చంద్రబాబు అన్యాయమైన విధానాలు ఉన్నాయని… 2014-19 మధ్య రాష్ట్రం చంద్రబాబు సకల అరాచకాలు, నిరంకుశానికి, మాఫియాకు ఒక ఉదాహరణగా నిలిచిందని ఆగ్రహించారు.

తనకు పట్టం కట్టిన ప్రాంతాన్నీ నిర్లక్ష్యం చేశారు.. లక్ష కోట్లతో రాజధాని కడతాం అన్న చంద్రబాబు విజయవాడలో కనీసం ఒక ఫ్లై ఓవర్ కూడా కట్టలేక పోయారని ఫైర్‌ అయ్యారు. నాయకులు, అధికారులు, విదేశస్తులు ఎవరు వచ్చినా విజయవాడ రావల్సిందేనని.. వచ్చిన వారు ఏమనుకుంటారు అన్న ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదని చురకలు అంటించారు. తాడేపల్లికి వెళితే ఎడారిలోకి వెళ్ళినట్లేనన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version