ములుగు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు వీరే..

-

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం పోలీసులు మృతుల వివరాలను వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు దళ కమాండర్ బద్రు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, టీఎస్ సీఎం సెక్రటరీ (యెల్లందు-నర్సంపేట) కుర్సం మంగు భద్రు అలియాస్ పాపన్న, ఏటూరునాగారం మహదేవ్‌పూర్ డీవీ సీఎం కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఏసీఎం ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ఏసీఎం ముస్సాకి జమున, పార్టీ సభ్యులు జైసింగ్, కిషోర్, కామేష్‌లు ఉన్నట్లు వివరించారు.

చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో భద్రు, మధుల నుంచి రెండు ఏకే 47 తుపాకులతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కాగా, తాజా జరిగిన ఎన్ కౌంటర్‌తో ఏటూరు నాగారం అటవీ ప్రాంతం, చుట్టుపక్కల గ్రామాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటుచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version