ఆగస్టులో అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!

-

ప్రతి నెల అన్ని రంగాల్లో కొన్ని రూల్స్ మారుతున్న సంగతి తెలిసిందే.. అలాగే ఆగస్టులో కూడా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి..ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఎన్నో రూల్స్ లో మార్పులు రావడం మనం గమనిస్తూనే ఉంటాము..ఆగస్టులో కూడా కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, వడ్డీ రేట్లు, ఎల్‍పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇలా అన్నీ సామాన్యులపై ప్రభావం చూపే నియమనిబంధనలే ఉన్నాయి. మరి ఆగస్టులో అమలులోకి రాబోయే రూల్స్ ఏంటో ఇప్పుడు చుద్దాము..

గ్యాస్ సిలిండర్ ధర..

ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చు, తగ్గొచ్చు, లేదా స్థిరంగా ఉండొచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలపై గ్యాస్ సిలిండర్ ధర ఆధారపడి ఉంటుంది..

వడ్డీ రేట్లు..

బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఆగస్ట్ 5న ఆర్‌బీఐ మరోసారి రెపో రేట్ పెంచబోతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈసారి వడ్డీ రేట్లు 35 బేసిస్ పాయింట్స్ అంటే 35 పైసలు పెరిగే అవకాశం ఉంది. ఆర్‍బీఐ ఇప్పటికే మే 4న రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్, జూన్ 8న 50 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే..అదే విధంగా ఆగస్టులో కూడా వడ్డీ రేట్లు పూర్తిగా పెరిగే అవకాశం వుంది.

చెక్ రూల్స్..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ 2022 ఆగస్ట్ 1న అమలులోకి రానున్నాయి. రూ.5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన చెక్స్‌ని ఎన్‌క్యాష్ చేయడానికి పాజిటీవ్ పే సిస్టమ్ తప్పనిసరి. కస్టమర్లు ఎవరికైనా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్ ఇస్తే ఇమెయిల్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆ వివరాలను బ్యాంకుకు కూడా తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా అన్ని బ్యాంకులు కస్టమర్లకు తెలియజెస్తున్నాయి..

ఐటీ రిటర్న్స్..

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈ గడువు పొడిగించే ఆలోచన లేదని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆగస్ట్ 1 నుంచి రిటర్న్స్ ఫైల్ చేసేవారంతా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 ఫైన్ చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. వార్షికాదాయం రూ.5,00,000 కన్నా ఎక్కువ ఉన్నవారికి రూ.5,000 జరిమానా చెల్లించుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version