వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అయితే ఎప్పుడూ సమస్యలే ఉంటాయని అనుకోవడం పొరపాటు. ఒక్కొక్క సారి సమస్యలు ఉంటే ఒక్కొక్క సారి ఆనందాలు ఉంటాయి. సర్దుకు పోతే భార్యా భర్తల మధ్య సమస్యలే ఉండవు. అయితే భార్య భర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకోవడం ఒకరి ఆలోచనలకి మరొకరు విలువ ఇవ్వడం, వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడం ఇటువంటివన్నీ పాటిస్తే ఎంతటి పెద్ద సమస్య అయినా సరే తొలగిపోతుంది.
కొంత మంది పురుషులు భార్య ఉన్నా సరే మరొకరితో సంబంధాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎందుకు పురుషులు భార్య ఉండగా మరొకరితో సంబంధం పెట్టుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ అలవాటు చాలా మంది పురుషులకు ఉంది. చాలామంది ఇటువంటి తప్పును చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని ప్రతి ఒక్కరు జీవితంలో కోరుకుంటూ ఉంటారు.
ఆ వ్యక్తి జీవితం లోకి వచ్చినా బోర్ కొట్టి లేదంటే ప్రేమ తగ్గిపోయో మరొకరిని కోరుకుంటారు కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య నెగెటివిటీ వలన కూడా భర్త ఫీల్ అయ్యి మరొకరితో సంబంధం పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా తన భార్య అలానే ఉంటుంది అని భావించి మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు.
అలానే భార్య నుండి వాళ్లు కోరుకున్నది దొరకకపోయినా సరే మరొకరితో సంబంధం పెట్టుకుంటారు. పైగా కొంతమంది పురుషులకి రోజు ఒకేలా ఉంటే వాళ్ళకి నచ్చదు. వాళ్లు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు అవి జరగకపోయినా సరే మరొకరిని వీళ్ళు కోరుకుంటూ వుంటారు.