ఏపీలో బీఆర్ఎస్..కొడాలి మనసులో మాట..అంత సీన్ లేదా?

-

ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించే దిశగా కేసీఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ కీలక నేతలని టార్గెట్ చేసుకుని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్‌ని బీఆర్ఎస్‌లోకి తీసుకుంటున్నారు. ఈయన గతంలో జనసేనలో పనిచేశారు..గత ఎన్నికల్లో జనసేన తరుపున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరిపోయారు.

ఇక ఈయనే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే..ఇంకా కొంతమంది కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరతారని తెలుస్తోంది. అలా అలా ఏపీలో పార్టీని విస్తరించి..వచ్చే ఎన్నికల బరిలో దిగాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై వైసీపీ నేతలు స్పందించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ తో వైసీపీ పొత్తు ఉంటుందనే ప్రచారం వస్తున్న నేపథ్యంలో..ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా కొడాలి నాని కూడా అదే మాట చెప్పారు. ఎవరితోనూ వైసీపీకి పొత్తు ఉండదని అన్నారు.

కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని, కానీ అంశాల వారిగానే జాతీయ పార్టీలకు వైసీపీ మద్ధతు ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు. కానీ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో వైసీపీకి పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కేసీఆర్ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఏ మాత్రం ఉండదని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ప్రభావం చూపలేదని చెబుతున్నారు.

అంటే ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండదని కొడాలి చెప్పే మాటల్లో కాస్త వాస్తవం ఉందని చెప్పవచ్చు..ప్రస్తుతం ఏపీలో వైసీపీ-టీడీపీ-జనసేనలతో ఖాళీ లేదు. ఈ స్పేస్ లో బీఆర్ఎస్ ఎదగడం కష్టం. పైగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీని టార్గెట్ చేసుకుని కేసీఆర్ చేసిన రాజకీయం అందరికీ తెలుసు. కాబట్టి ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఇప్పటిలో ఉండకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version