కుంభమేళాలో నదీ స్నానాలు ఆచరించడానికి ప్రత్యేకమైన రోజులు ఇవే..

-

2021 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రపంచం లోనే అతి పెద్దదైన కుంభమేళా ప్రారంభం కానుంది. ఇది ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ కుంభమేళాని గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ నగరం తో పాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్‌ లో కూడా జరగనుంది. దీనిని చూడడానికి లక్షలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుండి కూడా వస్తారు. అలానే ఈ పవిత్ర గంగా నది లో పవిత్ర స్నానాన్ని చేస్తారు. ఇక్కడ పవిత్ర స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, వ్యాధులు, పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఈ సారి మకర సంక్రాంతి జనవరి 14 నుంచి ఈ కుంభమేళా ఉత్సవం ప్రారంభం అవ్వనుంది. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది. ఇది ఇలా ఉండగా ఈ కుంభమేళా లో ప్రధానంగా 4 షాహిస్నాన్ ఘాట్‌లు, 6 ప్రధాన స్నాన ఘాట్‌ లు ఉన్నాయి. పర్వదినాల్లో భక్తులు వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తారు. ఇక నదీ స్నానాలు ఆచరించడానికి ప్రత్యేకమైన రోజులు విషయానికి వస్తే..

ఫిబ్రవరి 11న – మౌని అమావాస్య, ఫిబ్రవరి 16న – వసంత పంచమి, ఫిబ్రవరి 27న – మాఘ పూర్ణిమ, మార్చి 11న – మహా శివరాత్రి, ఏప్రిల్ 12న – సోమవతి అమవాస్య, ఏప్రిల్ 14న – బైసాకి,  ఏప్రిల్ 21న – శ్రీరామ నవమి, ఏప్రిల్ 27న – చైత్ర పూర్ణిమ చాల మంచి రోజులు. భక్తుల రద్దీ కూడా ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version