ఈ సెలబ్రిటీల ఇంటి పేరులో ఉన్న ప్రత్యేకత మీకు తెలుసా?

-

సాధారణంగా ప్రతీ ఒక్క వ్యక్తికి ఇంటి పేరు ఉండటం సహజం. ప్రతీ ఒక్కరు కూడా తమ ఇంటి పేరు ద్వారానే తమను గుర్తించాలని అనుకుంటారు. తాము ఎంచుకున్న రంగంలో తమ ఇంటి పేరుతో రాణించాలని అనుకుంటారు. అలా సినిమా రంగంలోనూ ప్రతీ ఒక్కరు అనుకుంటారు. కాగా, ఈ సెలబ్రిటీలకు మాత్రం ఇంటి పేరు కాకుండా తాము చేసిన ఫస్ట్ ఫిల్మ్…పేరు ఇంటి పేరుగా మారిపోయి..అదే వారికి బాగా కలిసొచ్చింది. ఆ సెలబ్రిటీలెవరో ఇక్కడ తెలుసుకుందాం.

 

 

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు..అసలు పేరు రాజు.. మాత్రమే. కానీ, ‘దిల్’ ఫిల్మ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అలా ఆయనకు దిల్ రాజు అని పేరు వచ్చింది. ప్రజెంట్ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్న దిల్ రాజు…టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్-రామ్ చరణ్ కాంబో ఫిల్మ్ RC 15ను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

దివంగత సినీ గేయ రచయిత, పద్మ శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి ఇంటి పేరు ‘సిరివెన్నెల’ అని సినీ ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, నిజానికి ఆయన ఇంటి పేరు చేంబోలు. కాగా, కళా తపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ఆయన రచించిన పాటల ద్వారా ఖ్యాతి గడించి..‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అయిపోయారు.

vennela kishore tollywood comedian

వెండితెరపైన ఆయన కనబడితే చాలు నవ్వు అలా వచ్చేస్తుంటుంది. అలా జనాలను తనదైన శైలి కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్ తో ఎంటర్ టైన్ చేస్తున్నాడు కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్. కిశోర్ ఫస్ట్ ఫిల్మ్ ‘వెన్నెల’లో మంచి పేరు వచ్చిన నేపథ్యంలో ఆయనకు వెన్నెల కిశోర్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ వెన్నెల కిశోర్ అని చెప్పొచ్చు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఇప్పటికే వెన్నెల కిశోర్ దాదాపుగా యాక్ట్ చేశాడు.

టాలీవుడ్ లో నవ్వులు పూయించే చక్కటి దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ. ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు జనాలను బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఈవీవీ తనయుడు నరేశ్..తొలి సినిమా ‘అల్లరి’ కాగా, అదే పేరు ఆయన ఇంటి పేరు అయిపోవడం విశేషం. ప్రజెంట్ ‘అల్లరి’ నరేశ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు కనబడుతోంది. ‘నాంది’తో సీరియస్ రోల్ ప్లే చేసి ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేశ్..ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక కమెడియన్ రాజేశ్ ..కూడా ‘సత్యం’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయనకు ‘సత్యం’ రాజేశ్ అనే పేరొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version