ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తగా కలిసి కోవిడ్ 19 వ్యాక్సిన్‌కు గాను బ్రిటన్‌లో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఇప్పటికే ఒప్పందం చేసుకున్న భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆగస్టు చివరి వరకు 2 నుంచి 3 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయనుంది. అయితే ఆ వ్యాక్సిన్‌ను ముందుగా ముంబై, పూణె నగర వాసులకు ఇస్తారని తెలుస్తోంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ మన దేశంలో ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆగస్టు చివరి వరకు ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే అప్పుడే వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని చూస్తున్నారు. అయితే మహారాష్ట్రలోని ముంబై, పూణెలలో కరోనా కేసులు దేశంలోనే ఎక్కువగా నమోదవతున్న నేపథ్యంలో ముందుగా ఆ నగరాల వాసులకే ఆ వ్యాక్సిన్‌ను ఇస్తారని తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక సీరమ్ ఇనిస్టిట్యూట్ సదరు వ్యాక్సిన్‌కు నేరుగా ఫేజ్ 3 ట్రయల్స్ చేపట్టేందుకు భారత్‌లో ఇప్పటికే అనుమతులు తీసుకుంటోంది. మొత్తం 5 చోట్ల ట్రయల్స్ చేపట్టనున్నారు.