కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ రోజు పలు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలపడంతో పాటు… కలెక్టర్ ఎస్పీలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గిన తర్వాత గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.
రచ్చబండ కార్యక్రమం ద్వారా తానే స్వయంగా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, ఇక ఇళ్ల పట్టాలు కార్యక్రమానికి మానవత్వం ఉన్న వారు మద్దతు పలుకుతూ అంటూ వ్యాఖ్యానించారు సీఎం జగన్ . ఇక ప్రజలకు ఇసుక పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతుందని… ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు,