యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గోహత్యను ప్రోత్సహించడం, ముస్లిం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మత ప్రాతిపదికన దేశ విభజన కోసం నిలడిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని ”రామద్రోహులు”గా యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు.బీహార్ బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు.
నేను రాముడి రాష్ట్రం నుంచి వచ్చాను అని తెలిపారు. సీతా దేవి జన్మస్థలమైన బీహార్ ప్రజల హృదయాలతో అయోధ్య ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. రామద్రోహులు రామ భక్తులపై తూటాలను పేల్చారు, మాఫియా డాన్ మరణానికి సంతాపం తెలిపారని పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.1980వ దశకంలో ఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా ఉన్న సమయంలో ‘కరసేవకుల’పై పోలీసులు కాల్పులు జరపడం గురించి యోగి ప్రస్తావించారు.