ఓ ఇంట్లో చోరికి వెళ్లిన దొంగ.. ఫ్రిడ్జ్‌లో వైన్‌ ఉండటంతో కక్కుర్తి పడ్డాడు.. కట్‌ చేస్తే

-

దొంగతానికి వెళ్లినప్పుడు దొంగతనం మాత్రమే చేయాలి.. అది ఒక దొంగ లక్షణం.. కానీ ఇక్కడ ఒక దొంగ వైన్‌కు కక్కుర్తి పడ్డాడు.. అడ్డంగా దొరికిపోయాడు.. ఒక ఇంట్లో రెక్కీ వేసి దొంగతానికి వెళ్లాడు.. ఆ ఇంట్లో ఉండే నగలు, నగదు మూటకట్టాడు.. ఇక్కడి వరకూ బానే ఉంది. కానీ మనోడు ఫ్రిడ్జ్‌ డోర్‌ ఓపెన్‌ చేశాడండీ.. అంతే అందులో వైన్‌ బాటిల్‌ ఉంది. అది చూసిన దొంగకు ఒక పెగ్‌ వేయాలని కోరిక పుట్టింది. సర్లే ఒక్క పెగ్గే కదా అని వేశాడు.. అది ఒక్కదాంతే ఆగలేదు.. ఫుల్‌ అయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!!!

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఒక విచిత్రమైన చోరీ ఘటన వైరల్‌ అవుతుంది. చెన్నై అడయార్‌లోని కస్తూరిబాయి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని ఒక ఇంటి యజమాని తన కుటుంబంతో కలిసి ఇతర ప్రాంతంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లాడు. కొన్నిరోజులుగా ఇంటికి తాళం వేసే ఉంది. ఈ క్రమంలో సదరు ఇంటిని కొందరు దొంగలు గమనించారు.. ఒక రోజు రాత్రి.. ప్లాన్‌ వేసి ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లారు. ఆ తర్వాత.. బీరువాలోని డబ్బులు, నగలను దోచుకున్నాడు.

అక్కడే ఫ్రిడ్జ్‌లో మద్యం బాటిళ్లు ఉండటాన్ని దొంగ గమనించాడు. వెంటనే వచ్చిన పని మర్చిపోయి ఫూల్‌గా తాగేశాడు. కాసేపటికే అతగాడు.. నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో మరుసటి రోజు ఇంటి యజమాని ఇంటికి వచ్చేసరికి.. ఇంటి తాళం పగలగొట్టి ఉంది.. టెన్షన్ పడ్డాడు. వెంటనే బెడ్ రూమ్ లోకి వెళ్లి చూశాడు. బెడ్ మీద ఒక వ్యక్తి గురకపెట్టి నిద్రపోతున్నాడు. అతనికి దగ్గరలో సంచులు ఉన్నాయి. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే దొంగ నిద్ర నుంచి లేచి రెప్పపాటులో ఇంటి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో చోరీ చేసి పారిపోయిన దొంగ ఏముమలై (27 ఏళ్లు)ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన దొంగ నుంచి రూ.49,000 కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి వైన్‌కు ఆశపడి..అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version